భక్తజన సందోహంతో శబరిమల అయ్యప్ప ఆలయం కిటకిటలాడుతోంది. మండల దీక్ష చేసిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామివారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమిస్తున్నారు. మండల మకరవిళక్కు సీజన్ ఆరంభం నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకుంటున్నారు. గత ఏడాది రూ.13.33 కోట్ల ఆదాయం రాగా, ఈసారి ఇప్పటి వరకు రూ.41.64 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయని దేవస్థానం అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని పంబాలోని మనప్పరం ఆన్లైన్ కేంద్రం వద్ద విస్తృత ఏర్పాట్లు చేశామని చెప్పారు. దర్శనం లేకుండా ఏ భక్తుడు కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి లేదని అన్నారు. ఇక పవిత్ర పంబా నదిలో దుస్తులు వదిలిపెట్టాలనేది ఆచారంలో భాగం కాదని ఆయన పేర్కొన్నారు. నదిని కలుషితం చేయవద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Share