Current Date: 27 Nov, 2024

దక్షిణ కాలిఫోర్నియాలో 5.3 తీవ్రతతో భూకంపం

కాలిఫోర్నియాలోని లామోంట్ టౌన్ సమీపంలో బుధవారం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. లామోంట్ పట్టణానికి నైరుతి దిశలో 23 కిలోమీటర్ల దూరంలో 11.7 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు తాకినట్లు యూఎస్జిఎస్  తెలిపింది. ఈ భూకంపం తరువాత 2.5 నుండి 4.1 మధ్య తీవ్రతతో అనేక భూకంపాలు సంభవించాయని USGS చూపిన డేటా. రాత్రి 9:39 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది, నష్టం గురించి తక్షణ నివేదికలు లేవు.

Share