గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులకు అస్వస్థత తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 50 మంది తీవ్ర, మరో 50 మంది స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వడ్డించడంతోనే అస్వస్థతకు గురికావాల్సి వచ్చిందని బాధిత విద్యార్థులు ఆరోపించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. విద్యార్థులను స్థానిక తహసీల్దార్ కల్యాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.నాయుడుపేటలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తిరుపతి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పర్యటనలు వాయిదా వేసుకొని హుటాహుటిన నాయుడుపేటకు బయల్దేరారు.