Current Date: 27 Nov, 2024

ఏపీలో రెయిన్ అలెర్ట్ 5 రోజులు భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి.. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మరికొన్ని రోజులువానలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈశాన్య అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా రెండు ద్రోణులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారురాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు.తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగైదు రోజులు వానలు కురవబోతున్నాయి.

Share