5 రోజులు కుండపోత వర్షాలు ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్
Jul 16, 2024
దక్షిణాదిన నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. అలాగే ఒడిశాను ఆనుకొని బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. గుజరాత్, కేరళ దగ్గర ద్రోణి నుంచి గాలులు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయి. అలాగే దక్షిణాన షియర్ జోన్ ఉందని, బంగాళాఖాతంలో 19న మరో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈ పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 15 నుంచి 19 వరకూ అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని IMD చెప్పింది. అలాగే.. 15, 18, 19 తేదీల్లో తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది.