రాజకీయాలకు కాస్త బ్రేక్?దశాబ్దాల పాటు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా అలరించిన నటి రోజా, రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వెండితెరకు దూరమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ మేకప్ వేసుకుని 'అన్బే డయానా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో 'జమ' ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తుండగా, రమ్యా రంగనాథన్ హీరోయిన్గా నటిస్తున్నారు. 'గుడ్‌నైట్', 'లవర్' వంటి హిట్ చిత్రాలను అందించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.ఉత్తర చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంలో, ఒక మధ్యతరగతి కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ కుటుంబానికి చెందిన యువకుడు ఒక ఆంగ్లో ఇండియన్ యువతిని ప్రేమిస్తే చోటుచేసుకునే పరిణామాలు, మత విభేదాలు, భావోద్వేగాలను ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. రోజా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. చెన్నై నగరాన్ని ఒక సరికొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భరత్ శంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. వినోదంతో పాటు సామాజిక అంశాలను స్పృశిస్తూ వస్తున్న ఈ చిత్రం రోజా కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.