Current Date: 25 Nov, 2024

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పరీక్షలు తెలుగు మాధ్యంలోనే రాసుకోవచ్చని తెలిపింది. 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతులను ఇంగ్లిష్ మాధ్యమంలోకి మార్చుతూ అప్పటి సర్కారు ఆదేశాలిచ్చింది.అయితే, సుప్రీంకోర్టులో ఈ విషయమై కేసు దాఖలు ‘కావడంతో ‘ఇంగ్లిష్ మీడియం అని చెప్పకుండా ‘ఒకే మాధ్యమం’ ఉండాలని ఆదేశించింది. ఒకే మాధ్యమం అని చెప్పి, అది ఏ మాధ్యమం అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా పాఠశాల్లలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండింటినీ కొనసాగించారు. ఈ నేపథ్యంలో తెలుగులో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలంటూ ఉపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి తెలుగులో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Share