Current Date: 25 Nov, 2024

బంగ్లాదేశ్‌లో చిక్కుల్లో పడిన సీనియర్ క్రికెటర్.. మర్డర్ కేసు నమోదు

బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ చిక్కుల్లో పడ్డారు. అతనిపై మర్డర్ కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాకి నిరసనగా ఆగస్టు 5న రుబెల్ అడాబోర్‌లోని రింగ్ రోడ్డులో భారీ నిరసన జరిగింది. ఈ క్రమంలో జరిగిన కాల్పల్లో ప్రాణాలు కోల్పోయిన రుబెల్ అనే యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్న షకిబ్ అల్ హసన్‌‌ కూడా చిక్కుకున్నారు.ఆరోజు నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రుబెల్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడ్డ సదరు యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత చనిపోయాడు. దీంతో తన కుమారుడి మృతికి ప్రభుత్వమే కారణమి.. రుబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లామ్.. పోలీసు స్టేషన‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, ఆ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న షకిబ్ అల్ హసన్ సహా.. 150 మందిపై హత్యా కేసు నమోదైంది. ఇందులో షకిబ్ అల్ హసన్‌ 28వ నిందితుడిగా ఉన్నాడు.

Share