Current Date: 05 Oct, 2024

బిగ్‌బాస్ నుంచి వేణుస్వామి ఔట్ నోరు జారినందుుకు మూల్యం

బిగ్‌బాస్ 8 సీజన్‌ తెలుగులో త్వరలోనే మొదలుకాబోతోంది. ఈ షోలో పాల్గొనే కంటెస్ట్ జాబితాలో ఎక్కువగా వినిపించిన వివాదాస్పద  జ్యోతిష్యుడు వేణుస్వామి‌ని తాజాగా లిస్ట్ నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తప్పు మీద తప్పు చేస్తున్న వేణు స్వామి ఓ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు లిస్ట్ లో వేణు స్వామి పేరు కూడా గట్టిగా వినిపించింది. టాప్-5లో వేణు స్వామి పేరు ఉందని కూడా వార్తలు వచ్చాయి. కానీ .. ఇటీవల నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ చేసుకోగా  ఉద్దేశపూర్వకంగానే వేణుస్వామి నోరుజారాడు. వాళ్లిద్దరూ విడిపోతారంటూ జోస్యం చెప్పాడు. దీనిపై దుమారం రేగడ  మధ్యలో టీవీ5 మూర్తీతో గొడవతో వరుస వివాదాలో వేణు స్వామిని చుట్టుముట్టాయి. నిజానికి ఇలాంటి వివాదాస్పద వ్యక్తులే బిగ్ బాస్‌ షోకి కూడా కావాలి.  కానీ రియాలిటీ షోకు హోస్ట్ నాగార్జున. దాంతో నాగ్ కొడుకు, కాబోయే కోడలి గురించి నెగటివ్‌గా చెప్పడంతో హౌజ్‌లో అడుగు పెట్టకముందే వేణుస్వామి ఎగ్జిట్ అయిపోయాడు.

Share