Current Date: 07 Oct, 2024

నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ

నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. సాయంత్రం 4 గంటలకు అప్పన్న స్వామి వారి రథం ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ చేపట్టి పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకోవడం భక్తుల్లో అనవాయితీగా వస్తుంది. ఇక, 32 కిలో మీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణ కోసం జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది . ఐదుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 2600 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు గిరిప్రదక్షిణ కారణంగా ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. వివిధ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని. భక్తులు, ప్రజలు గమనించాలని అధికారులు సూచించా రు. నగరం మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. అయితే, సింహాచలం తొలి పావంచ వద్ద గిరి ప్రదక్షిణ మొదలు పెట్టా ల్సి ఉంటుంది. 

Share