Current Date: 07 Oct, 2024

వందేభారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుంది

వందేభారత్ స్లీపర్ రైలులో ఏసీ, నాన్ ఏసీ విభాగాలుంటాయి. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. బయటకు మాత్రం ఇప్పుడున్న వందేభారత్ రైళ్లలానే ఉంటాయి. లోపల మాత్తం పూర్తిగా మారిపోతుంది. విశాలమైన బెర్త్ కేబిన్స్, పై బెర్త్ ఎక్కేందుకు వీలుగా స్టెప్స్ వంటి సౌకర్యాలుంటాయి. పూర్తిగా సౌండ్ ప్రూఫ్ కావడంతో బయట్నించి ఎలాంటి శబ్దాలుండవు. హాయిగా నిద్రించవచ్చు. స్లీపర్ రైలులో 16 కోచ్‌లు , 823 బెర్త్‌లు ఉంటాయి. టికెట్ ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.

Share