Current Date: 28 Nov, 2024

గన్‌మెన్లని వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యేకోపమా?

ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. తనకు ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు.కూటమి అధికారంలోకి రాగానే తనకి మంత్రి పదవి వస్తుందని రవికుమార్ ఆశపడ్డారు. కానీ..  మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాళింగ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఉత్తరాంధ్ర నేతలు అసంతృప్తితో కనిపిస్తున్నారు. మొత్తానికి కూన రవికుమార్ మాత్రం త్వరగా బయటపెట్టారు.అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేశానని, ప్రజల్లో నిత్యం ఉన్నానని కూన తెలిపారు. తనకు గన్‌మెన్లు అవసరం లేదని, వారిని తిప్పి పంపడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హట్ టాపిక్ గా మారింది.

Share