Current Date: 06 Oct, 2024

తీహార్ జైలులో కవితకి ఏమైంది? రెండోసారి అస్వస్థత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో5 నెలలుగా జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న కవితను జైలు అధికారులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు కవితకు పలు పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందించారు. దీంతో.. కవిత ఆరోగ్యం కాస్త కుదుట పడింది.నిబంధనల ప్రకారం.. జైలు అధికారులు కవితను శుక్రవారం మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.  కవిత అనారోగ్యానికి గురికావటంతో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్‌ రావు హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తీహార్ జైలుకు వెళ్లి.. కవితను పరామర్శించారు.వాస్తవానికి  జులై 16న కూడా కవిత అస్వస్థతకు గురికాగా జైలు అధికారులు ఆమెను దీన్‌దయాళ్ అసుపత్రికి తరలించారు. అప్పడు కూడా.. తీవ్ర జ్వరం, గొంతునొప్పితోనే కవిత ఇబ్బంది పడ్డారు. కవితను పరీక్షించిన వైద్యులు అవసరమైన చికిత్సలు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు.

Share