Current Date: 27 Nov, 2024

ఫార్మాసిటీకి నిలిచిన నీటి సరఫరా

పరవాడ ఫార్మాసిటీని నీటి గండం వెంటాడుతుంది. ఎపిఐఐసి ఏలేరు కాలువపై తాడి వద్ద ఏర్పాటు చేసిన పంపింగ్‌ స్టేషన్‌ నుంచి నీటి సరఫరా నిలిచి పోవడంతో పరవాడ మండలంలో భూగర్జజలాలను పిండేస్తున్నారు. ప్రతి రోజూ వేల కిలీ లీటర్ల నీటిని ఫార్మా పరిశ్రమల అవసరాల కోసం తోడేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ కాలుష్యంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిసర గ్రామాల ప్రజలకు ఇప్పుడు భూగర్జ జలాలు అడిగంటే పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టారు. వేల కిలో లీటర్ల నీటిని పరవాడ మండలంలోని పరవాడ, ఇ మర్రిపాలెం, రావాడ, దళాయిపాలెం వ్యవసాయ బోర్ల నుంచి తోడేసి, ట్యాంకర్లతో తెచ్చి నింపుకుంటున్నారు. ఫార్మా పరిశ్రమలకు గడిచిన మూడు రోజులుగా మంచినీటి సరఫరాను నిలిపివేశారు. ఎపిఐఐసి ఏలేరు కాలవపై తాడి వద్ద నిర్మించిన పంపింగ్‌ స్టేషన్‌ నుంచి ఫార్మాసిటీ డెవలపర్‌ రాంకీకి నీటిని సరఫరా చేస్తుంది. అక్కడి నుంచి ఫార్మా కంపెనీలకు రాంకీ మంచినీటిని సరఫరా చేస్తుంది. ఎపిఐఐసి తాడి పంపింగ్‌ స్టేషన్‌ మరమ్మతులు కారణంగా నిలిచిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన ఎపిఐఐసి, రాంకీ పట్టించుకోడం లేదు. 

Share