Current Date: 25 Nov, 2024

ఏపీ పోలీసుల డ్రోన్ వస్తుంది జాగ్రత్త....

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గంజాయి సాగును అరికట్టడమే లక్ష్యంగా డ్రోన్లతో ఏజెన్సీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న వారిని డ్రోన్లతో బయటకు గుంజి పడేస్తున్నారు. పాడేరు, జి.మాడుగుల, హుకుపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. తాజాగా పెదబయలు మండలంలో 15 ఎకరాల్లో గంజాయి పంటలను పోలీసులు డ్రోన్ల ద్వారా గుర్తించి ధ్వంసం చేసి తగులబెట్టారు. నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హచ్చరించారు. గంజాయి సాగు, అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించడంతోపాటు దాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్​ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లా పోలీసులు దూకుడు పెంచారు. రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

Share