Current Date: 28 Nov, 2024

స్వీపర్ ఉద్యోగానికి 40వేల మంది గ్యాడ్యుయేట్లు దరఖాస్తు

భారతదేశంలో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారింది. ఏటా లక్షలాది మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు.కానీ తగినన్ని ఉద్యోగాలు లభించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందంటే చాలు లక్షల మంది నిరుద్యోగులు ఎగబడుతున్నారు. 10వ తరగతి అర్హతతో నోటిఫికేషన్ వెలువడినా.. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారు పోటీ పడుతున్నారు. హర్యానాలో స్వీపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా లక్ష మందికిపైగా దరఖాస్తు చేశారు. ఇందులో 46 వేల మంది డిగ్రీలు, పీజీలు చేసిన వారే ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల్లోనే లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 6 వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వారు కాగా.. 40 వేల మంది గ్రాడ్యుయేట్లు 1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగంలో చేరితే జీతం రూ.15 వేలు మాత్రమే వస్తుంది. అయినప్పటికీ భవిష్యత్తులో పర్మినెంట్ అవుతుందనే ఆశతో నిరుద్యోగులు ఎగబడుతున్నారు.ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ స్వీపర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్లు చెప్తున్నారు.

Share