Current Date: 28 Nov, 2024

డ్వాక్రా మహిళలతో 4లక్షల మెుక్కలు నాటిస్తాం స్పీకర్ అయ్యన్నపాత్రుడు

పట్టణంలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. పర్యావరణానికి చెట్లు ఎంతో మేలు చేస్తాయని, వాటిని సంరక్షిస్తేనే జీవజాతి మనుగడ సాధ్యమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వనమహోత్సవంలో పలు రకాల మెుక్కలను అయ్యన్నపాత్రుడు నాటారు. మెుక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని, జిల్లావ్యాప్తంగా మెుక్కబడి లెక్కలు చెప్పకుండా అధికారులు 60లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. వాటి సంరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షలకు పైగా డ్వాక్రా సంఘాల మహిళలతో మెక్కులు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Share