Current Date: 25 Nov, 2024

వైసీపీ ప్రభుత్వం మెడకి చుట్టుకున్న అదానీ లంచాల కేసు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న అదానీ లంచాల కేసు.. ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని తాకింది. విద్యుత్ ఒప్పందాలు, గ్రీన్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టుల్లో అధిక లాభాల కోసం దేశంలోని పలువురు అధికారులకు వేలాది కోట్లులంచాలు ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీలు బయటపెట్టిన సంగతి తెలిసింది.ఆ ఏజెన్సీ తన అభియోగ పత్రంలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వంలోని అధికారులను సైతం ప్రస్తావించింది. ఏపీలో విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా.. 200 మిలియన్ డాలర్లు.. అంటే 1,680కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. అదానీ నుంచి లంచం తీసుకున్నట్లు అదానీపై నమోదైన అభియోగ పత్రంలో ప్రస్తావించారు.2021లో SECIతో విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అదానీ గ్రీన్ నుండి 200 మిలియన్ డాలర్లు లంచాలు అందుకున్నారని అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో ఆరోపించారు.

Share