Current Date: 05 Oct, 2024

బిగించిన పిడికిలి నా తెలంగాణ... రేవంత్ రెడ్డి...

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కవితాత్మకంగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ, ఆ పిడికిలి విప్పిచూస్తే.. త్యాగం, ధిక్కారం, పోరాటం కనిపిస్తాయని చెప్పారు. ఆ స్ఫూర్తితో ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుంది, విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుంది.. అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’’.