సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహ ణాధికారి ఎస్. శ్రీనివాసమూర్తి ఈరోజు ఆలయ పరిసరాల్లో ని వర్ష ప్రభావిత ప్రాంతా లను పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు క్యూ లైన్ లో వర్షాలు ఎండలకు తగ్గ ట్టుగా ఆలయ స్థానాచార్యులు, వైష్ణవ స్వాములతో చర్చించి షెడ్లు ఏర్పాటు చేయ వలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజును ఈవో ఆదేశించారు. వర్షాలు కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు స్వీకరించే ఉచిత ప్రసాదాల నాణ్యత ను తనిఖీ చేశారు. నాణ్యత బాగుందంటూ భక్తులు చెప్పడంతో ఇఓ శ్రీనివాసమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉచిత ప్రసాదం వద్ద గల సేవా వాలంటీర్ల కు పలు సూచనలు చేశా రు. భక్తుల సౌకర్యార్థం దక్షిణ రాజగోపురం వద్ద డొనేషన్ కౌంటర్ ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాల వితరణ, పుస్తక విక్రయ కేంద్రం, స్వామి వారి నివేదన కు అవసరమగు నిత్యవసర వస్తువుల స్టోర్ ఏర్పాటు అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్ శ్రీనివాసరాజు కు త్వరితగతిన పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు.