పిచ్చి పలురకాలు వెర్రి వేయి విధాలు అంటే ఇదేనేమోఫొటోలు, వీడియోల కోసం కొందరు వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమని తెలిసినా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 380 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతున్న భారీ జలపాతం అంచున పడుకొని ఓ మహిళా టూరిస్ట్ జలకాలాడిన వీడియో ఒకటి నెట్టింట మళ్లీ చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాల్లో విక్టోరియా ఫాల్స్ ఒకటి. జాంబియా–జింబాబ్వే దేశాల మధ్య ప్రవహించే ప్రఖ్యాత విక్టోరియా ఫాల్స్ అంచున పడుకొని కిందకు చూడటం కనిపించింది. ఆ సమయంలో జలపాతంలోని నీరు ఉద్ధృతంగా కిందకు ప్రవహిస్తోంది. ఎందరో టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న ఈ జలపాతాన్ని స్థానికులు డెవిల్స్ పూల్ గా అభివర్ణిస్తుంటారు. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్ ఈ వీడియోను నెటిజన్లతో పంచుకుంది. ‘380 అడుగుల జలపాతానికి ఇంత దగ్గరగా నిలవడం అనేది మామూలు విషయమే అని తెలుసుకున్నా అంటూ ఆ వీడియో కింద కామెంట్ పోస్ట్ కూడా చేసింది.