విశాఖపట్టణంలో ఈ నెల మూడో తేదీన భారీ అగ్నిప్రమాదం సంభవించి దాదాపు రూ. 300 కోట్లు నష్టం వాటిల్లిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్తు కేబుళ్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టీల్ మెల్టింగ్ షాప్ -2లో మంటలు చెలరేగాయి. వాటిని సకాలంలో అదుపు చేయలేకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. అవగాహన లేకుండా తాళాలు వేయాల్సిన చోట వెల్డింగ్ చేయడంతో అవి తెరవడానికి కుదరకపోవడంతో అత్యంత శక్తిమంతమైన కేబుళ్లు కాలిపోయాయి. వాటిని పునరుద్ధరించాలంటే మొదటి నుంచీ మళ్లీ పని చేపట్టాల్సి ఉంటుందని, అందుకు రూ. 300 కోట్ల వ్యయంతోపాటు మూడు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.