జమ్మూకశ్మీర్‌లోని రాష్ట్రం అనంత్‌నాగ్ జిల్లాలో 30 ఏళ్ల తర్వాత ఉమా భగవతీ దేవి ఆలయాన్ని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో తెరిచినట్లు అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనుల తరువాత, ఆలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.తొలిరోజు అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఉమా దేవి విగ్రహాన్ని మంత్రోచ్ఛారణల నడుమ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఆలయ పునరుద్ధరణపై స్థానికులు, కాశ్మీరీ పండిట్లు, సంతోషం వ్యక్తం చేశారు.