స్పైస్‌జెట్ కీలక నిర్ణయం సిబ్బందికి 3 నెలల సెలవులు నో శాలరీ
Aug 30, 2024
లోబడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. గత ఆరేళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టతరంగా మారిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిసారించింది. దీనిలో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు సెలవుల్లో పంపించినట్లు ప్రకటించింది. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.