Current Date: 05 Oct, 2024

బాలయ్య నటనకు నేటితో 50 ఏళ్లు ఎల్లుండి ఘన సన్మానం

చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మాకే సొంతం అని నందమూరి బాలకృష్ణ అంటుంటారు. అది ఆయన సీరియస్ అంటారో లేక సరదాగా అంటారో కానీ అది నిజమే అనిపిస్తుంది. ఈరోజుతో సినీ నటుడిగా ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 1974 ఆగస్ట్ 30న అంటే సరిగ్గా ఇదే రోజున విడుదలైన 'తాతమ్మ కల' చిత్రంతో సిని పరిశ్రమలోని బాలయ్య అడుగుపెట్టారు. సాధారణంగా 30 ఏళ్లు లేదా 40 పూర్తి చేసుకున్న హీరోలు ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అవుతారు. బాలయ్య మాత్రం ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో బాలయ్య నటించిన ప్రతి సినిమా రూ. 100 కోట్ల మార్కును దాటుతోంది. నటుడిగా 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న బాలయ్యను సినీ పరిశ్రమ ఘనంగా సన్మానించబోతోంది. సెప్టెంబర్ 1న దక్షిణాది సినీ పరిశ్రమలోని అతిరథ మహారథుల సమక్షంలో ఆయనకు ఘన సన్మానం చేయబోతున్నారు.

Share