Current Date: 05 Oct, 2024

మందు బాబులకి షాక్.. 3 రోజులు దుకాణాలు బంద్!

ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మందు బాబులకి షాక్ తగలనుంది. శాంతిభద్రతల రీత్యా 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు అధికారులు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చారు.జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని డీజీపీ, జిల్లా ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు ఈసీ చర్యలు చేపట్టింది.భారీగా స్థాయిలో కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రోఅబ్జర్వర్లు కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య కౌంటింగ్ నిర్వహించనున్నారు. బ్యారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు, వాహనాల పార్కింగ్, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి ప్రణాళిక, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయనున్నారు.