Current Date: 26 Nov, 2024

విమానాల్లో బాంబ్.. 3 రోజులు ముప్పుతిప్పలు పెట్టిన 17 ఏళ్ల కుర్రాడు

దేశ వ్యాప్తంగా గత 3 రోజులుగా ఒకటే టెన్షన్. విమానంలో బాంబ్ అంటూ వరుస బెదిరింపులు రావడంతో అధికారులు, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 విమానాలకు ఈ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. దాంతో ప్రయాణికులకి ఆలస్యం.. విమానయాన సంస్థలకి కోట్లాది రూపాయలు నష్టం వచ్చింది. ఎట్టకేలకు ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఛత్తీస్‌గడ్ ఓ బిజినెస్‌మెన్ కొడుకు ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. అతని వయసు కేవలం 17 ఏళ్లే కాగా.. ఎందుకు ఇలా చేశాడో ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. కానీ.. ముంబయి-న్యూయార్క్ ఎయిరిండియా విమానం.. ముంబయి నుంచి మస్కట్, జెడ్డా వెళ్లే ఇండిగో విమానాలకు ఈ మైనర్ బాలుడే బాంబ్ బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఓవరాల్‌గా గత 3 రోజులు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ బెదిరింపుల కాల్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఈ బెదిరింపులకి పాల్పడింది ఒక మైనర్ కావడంతో లీగల్‌గా అతనిపై ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి.

Share