తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమతోపాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో సోమ, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఎండీ హైదరాబాద్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.