Current Date: 07 Oct, 2024

పెరిగిన టమాటా ధరలు కిలో ఎంతంటే

టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టమాటా కేజీ రూ.100కు చేరింది. అయితే ఇటీవల కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లలో అయితే కేజీ టమాటా ఒక మాదిరిగా ఉన్న టమాటాలు కేజీ రూ. 40, 50లకు లభించగా  పెద్దగా ఉన్న టమాటాలు రూ. 60కు లభించాయి. ఇప్పుడు మరోసారి టమాటా ధరలు పెరిగాయి. ఇప్పుడు గ్రేడ్-ఏ టమాటాలు కేజీ రూ.100కు చేరింది. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. కాగా నిన్న, మొన్నటి వరకు ధరలు లేక డీలా పడిన టమోటా రైతులు పెరిగిన ధరలతో ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share