బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రాణభయంతో అక్కడి నుంచి భారత్‌కి వచ్చేసింది. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె అయిన హసీనా ఇలా అర్ధాంతరంగా ప్రధాని పీఠం వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. దీనికి కారణం 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ పునరుద్ధరణ చేయడమే.అవామీలీగ్ మద్దతుదారులకు ప్రయోజనం కల్పించేలా ఆ రిజర్వేషన్ ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సంబంధిత కోటాను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. శాంతియుతంగా మొదలైన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లను కుదించాలని ఆదేశించింది. అందుకు హసీనా సర్కారు అంగీకరించింది. అయినప్పటికీ మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో హసీనా పదవి నుంచి దిగిపోక తప్పలేదు.నిజానికి 1975లోనే హసీనా చనిపోవాల్సింది. ఆమె ఫ్యామిలీలోని వాళ్లంతా మిలిటరీ అధికారుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు.
Share