ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాపై నిరంతరం అనేక రూమర్లు వస్తూనే ఉన్నాయి. సినిమా విషయంలో గత కొన్ని రోజులుగా హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కోపంతో బన్ని గడ్డం కూడా తీసేశాడని, షూటింగ్ నుంచి వెళ్లిపోయారని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని గతంలో టీమ్ వెల్లడించింది. అయితే డైరెక్టర్ సుకుమారే షూటింగ్‌ను ఆలస్యంగా చేస్తున్నారని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. బ్లాక్ బస్టర్ అయిన పుష్పకు సీక్వేల్‌గా పుష్ప 2 వస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీంతో సీన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, డైరెక్టర్ సుకుమార్ రీ షూట్ చేయడం వలన లేట్ అవుతుందని బన్నీ వాసు క్లారీటీ ఇచ్చారు.ఈ కారణాల వలనే ఐకాన్ స్టార్ అసంతృప్తిగా ఉన్నారనే దానిలో నిజం లేదని తెలిపారు. సినిమా డిసెంబరులో థియేటర్లలోకి రానుంది. పుష్ప-1 కూడా డిసెంబరులోనే వచ్చి బంపర్ హిట్ కావడంతో అదే సెంటిమెంట్‌ను చిత్ర యూనిట్ కొనసాగించబోతోంది.
Share