ఫేక్ డాక్యుమెంట్స్‌తో బ్యాంక్‌ను మోసం చేసిన కంప్యూటర్ ఆపరేటర్ శిక్ష నుంచి తప్పించుకోవడానికి 20 ఏళ్లు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో మారుపేర్లతో వేష, భాషలు మార్చి అధికారులను తప్పుదోవ పట్టించాడు. కానీ చివరికి కన్నపేగుపై ఉన్న మమకారాన్ని చంపుకోలేక అధికారులకి దొరికిపోయాడు. దాదాపు 20 ఏళ్లు అతడిని వెంటాడిన సీబీఐ ఎట్టకేలకి అరెస్ట్ చేసింది.హైదరాబాద్‌లోని చందులాల్ బారాదరీ ఎస్‌బీఐ బ్రాంచిలో 20 ఏళ్ల క్రితం కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన చలపతిరావు తప్పుడు పత్రాలతో రూ.50 లక్షలు లోన్ తీసుకుని ఎగ్గొట్టాడు. ఈ కేసు అప్పట్లో సీబీఐ చేతుల్లోకి వెళ్లగా ఇక అక్కడి నుంచి నిందితుడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తమిళనాడులోని సేలం చేరుకుని వినీత్‌కుమార్‌గా పేరు మార్చుకున్నాడు. అక్కడ మరో పెళ్లి చేసుకున్నాడు. 2014లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ వెళ్లి రుణ రికవరీ ఏజెంట్ అవతారం ఎత్తాడు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.2016లో మహారాష్ట్ర ఔరంగాబాద్ సమీప వేరుల్‌లో ఉన్న ఆశ్రమానికి చేరుకొని స్వామి విదితాత్మానందతీర్థ అవతారమెత్తాడు. 2021లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కొన్ని రోజులు మకాం వేశాడు.
Share