పవన్ కళ్యాణ్ తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను పూర్తిచేసుకుని, చివరిరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కాలినడకన వెళ్లారు. కానీ అలిపిరి నుంచి తిరుమల చేరడానికి ఏకంగా నాలుగున్నర గంటలకు పైగా సమయం తీసుకోవడంతో పాటు.. అసలు నడిచి ఎక్కగలరా లేదా అని ఆయన వ్యక్తిగత సిబ్బంది టెన్షన్ పడే పరిస్థితిని కల్పించారు.తెలుగు హీరోల్లో మార్షల్ ఆర్ట్స్ లో అగణ్యమైన ప్రతిభ, సాధన ఉన్న హీరో కూడా పవన్ కల్యాణ్ మాత్రమే. అలాంటి హీరో కూడా తిరుమల మెట్లు ఎక్కడానికి నానా అవస్థలు పడడం ఏమిటి? అని వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తోంది. మోకాళ్ల మండపం దాకా చేరుకున్న తర్వాత పవన్ అసలు పూర్తిగా కాలినడకన వెళతారా లేదా అనే చర్చ నడిచింది.అక్కడ ఆయన ఫిజియో థెరపీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది.మోకాళ్ల పర్వతం నుంచి కారులో తిరుమలకు వెళ్తారని ప్రచారం జరిగింది. అధికారులు అందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే పవన్ కల్యాణ్ చాలా పట్టుదలగా కష్టపడి పూర్తిగా కొండ ఎక్కారు. సాధారణంగా ఆరోగ్యం, ఫిటెనెస్ ఉండే వాళ్లు గంట, గంటన్నలోపే అలిపిరి మెట్ల ద్వారా కొండపైకి చేరగలరు.