Current Date: 07 Oct, 2024

కాకులకి ఉన్న ఇంగితం.. మనుషులకి లేకపోయె!

అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక చికెన్ షాపు యజమానిని ఒక కాకి ఉదయం నుంచి అరుస్తూ విసిగించింది. దాంతో విసిగిపోయిన ఆ షాప్ యజమాని దానికి ముక్క ఎరగా వేసి తెలివిగా పట్టుకుని తాడుతో కట్టేశాడు. దాంతో అది సహాయం కోసం మరింతగా అరవడం మొదలు పెట్టింది. అంతే నిమిషాల వ్యవధిలోనే వందల కాకులు వచ్చి అక్కడ వాలిపోయి అరవడం మొదలుపెట్టాయి. కాకులు ఎవర్నీ ఏం చేయలేదు. కాలు కింద పెట్టలేదు. కట్టేసిన కాకిని వదిలి పెట్టే వరకు ఆ ప్రాంతంలో ఎగురుతూ గోల గోల చేశాయి. వాటి గోల స్థానిక ప్రజలు వాటి గోలను భరించలేకపోయారు. చివరకు కాకులు అనుకున్నది సాధించాయి. ఆ గోలతో చేసేదేమి లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. అంతే ఆ కాకితో కలిసి మిగిలిన కాకులు ఎగిరిపోయాయి. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ చెందిన ఓ వ్యక్తి.. వైయస్‌ఆర్‌సీపీకి చెందిన వ్యక్తిని నడిరోడ్డుపై బుధవారం రాత్రి నరికాడు. అది కూడ ఆందరూ చూస్తుండగానే.. అయినా అటూ ఇటూ జనం తిరుగుతూనే తప్ప పట్టించుకున్న వారు లేరు. చేతులు తెగిపోయి బాధితుడు ఆర్తనాదాలు చేశాడు. వదిలేయాలని ప్రాథేయపడుతూ కాపాడాలని అందరినీ అర్థించాడు. 

Share