Current Date: 06 Oct, 2024

తీవ్రరూపం దాల్చుతోన్న ‘రెమాల్‌’ తుపానుఆంధ్రాలో ఈ ప్రాంతాల్లో కుండపోత వాన

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను.. తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో.. వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్కు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా – వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలుల వీచే అవాకశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్‌ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ  అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో రేపటి  వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు జారీ చేసింది. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.