ఏపీలోని పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈనెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడుతుందన్నారు. ఈ నెల 26 నుంచి ఏపీపై వర్షాల ప్రభావం మూడు రోజుల పాటు ఉంటుందన్నారు. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్.. పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. లెటెస్ట్‌గా వాతావరణ శాఖ హెచ్చరికలతో పంటకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు ప్రయాణిస్తుందన్నారు. వాయుగుండంగా బలపడిన తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాల ప్రభావం ఉంటుందన్నారు.
Share