గుజరాత్ లోని వడోదరలో సి-295 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాప్ట్ తయారీ కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. టాటా భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ దీనిని నెలకొల్పింది. ఐరోపాకు చెందిన ఈ సంస్థ బయటి దేశాల్లో ఇటువంటి ఎయిర్ క్రాప్ట్ లను తయారు చేయడం ఇదే తొలిసారి. మొత్తం 56 విమానాలను తయారు చేసేందుకు స్పెయిన్, భారత దేశం మధ్య ఒప్పందం కుదిరింది. మొదట 16 విమానాలను స్పెయిన్ లో తయారు చేయగా.. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు తయారు చేస్తుంది. దేశంలోనే తొలిసారిగా మిలిటరీకి సంబంధించిన విమానాలను ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేయనుంది.
Share