సెనర్జీస్ క్యాస్టింగ్ లిమిటెడ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. యాజమాన్యం ఆరు నెలల జీతాలు ఇవ్వకుండా తమను వేధిస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. సెనర్జీస్ ఎండి శేఖర్ మువ్వ మరణం తర్వాత కంపెనీ ఈ స్థితికి చేరుకున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. బకాయి పడ్డ వేతనాలు చెల్లించే వరకు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఈ కంపెనీలో 600 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు.