Current Date: 06 Oct, 2024

పాక్ గడ్డపైకి టీమిండియా వెళ్తుందా? 28 ఏళ్ల తర్వాత ఆహ్వానం

పాకిస్థాన్ దాదాపు 28 ఏళ్ల త‌ర్వాత తొలి ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది.ఐసీసీఛాంపియన్స్ ట్రోఫీ-2025కుఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విధాల సన్నద్దమవుతోంది.ఇప్పటికే తమ స్టేడియాల‌ పునర్నిర్మాణ ప‌నుల‌ను కూడా పీసీబీ ప్రారంభించింది. పాక్‌లో చివరగా 1996లో టోర్నీ(వన్డే వరల్డ్‌కప్‌) జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని  పీసీబీ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఈవెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. పీసీబీ మాత్రం భారత జట్టు కచ్చితంగా తమ దేశానికి రావల్సిందే అని మొండి పట్టుతో ఉంది. కాగా ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే భార‌త జ‌ట్టు పాక్‌కు వెళ్తుందా లేదా అన్న‌ది తేల్చాల్సిన బాధ్య‌త‌ కొత్తగా ఎన్నికైన ఐసీసీ ఛైర్మన్ జై షా నిర్ణయించబోతున్నారు.

Share