Current Date: 07 Oct, 2024

రూ.2.5 కోట్లు చాలు మిగతా రూ.2.5 కోట్లు వెనక్కి తీసుకోండి: బీసీసీఐకి ద్రావిడ్ విజ్ఞప్తి

టీమిండియా మాజీ ప్రధాని కోచ్, టీ20 వరల్డ్ కప్ 2024ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మాజీ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఎంత హూందాగా నడుచుకుంటారో తెలియజేసే పరిణామం ఒకటి వెలుగుచూసింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌‌ను గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఏకంగా రూ.125 కోట్ల భారీ రికార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భారీ మొత్తం నుంచి ఆటగాళ్లతో సమానంగా ప్రధాన కోచ్ ద్రావిడ్‌కు కూడా బీసీసీఐ రూ.5 కోట్లు అందించింది. అయితే ప్రత్యేకంగా తనకు రూ.5 కోట్లు వద్దని, ఇతర కోచింగ్ సిబ్బంది మాదిరిగానే రూ.2.5 కోట్లు ఇస్తే చాలని, మిగతా రూ.2.5 కోట్లు వెనక్కి తీసుకోవాలంటూ బీసీసీఐకి రాహుల్ ద్రావిడ్ విజ్ఞప్తి చేశాడు.

Share