తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూ ఉంది. నిన్న ఏడుకొండలవాడిని 77,568 మంది దర్శించుకోగా 35,033 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు లభించింది. 4.15 లక్షల లడ్డూలను విక్రయించారు.
Share