Current Date: 07 Oct, 2024

ముంబైలో జల ప్రళయం, రానున్న 24 గంటలు అత్యంత కీలకం, రెడ్ అలర్ట్ జారీ

దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరం భారీ వర్షాలతో అతలాకుతలమౌతోంది. ఊహించని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపధ్యంలో జనం భయాందోళనకు గురవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఉత్తరాదిలో దంచి కొడుతున్న వర్షాలు ఇప్పుడు ముంబై నగరాన్ని చుట్టుముట్టాయి. ఏకంగా 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగరమంతా చెరువులా మారిపోయింది. రవాణా వ్యవస్థ మొత్తం స్థంబించిపోయింది. ఎయిర్ పోర్ట్ లు, రైల్వే స్టేషన్లు, బస్డాండుల్లో నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువుల్లా మారిన రోడ్లపై కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోతున్నాయి. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి 100-120 మిల్లీమీటర్లు, మరి కొన్నిప్రాంతాల్లో 80-100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 
 

Share