ఉత్తరాఖండ్‌లోని శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం కనిపించడం లేదంటూ జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్య చేశారు. కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణం జరిగిందని, ఆ విషయాన్ని ఎందుకు లేవనెత్తడం లేదని ఆయన ప్రశ్నించారు. ‘‘అక్కడ చేసిన కుంభబకోణంతో ఢిల్లీలో కేదార్‌నాథ్‌ను నిర్మిస్తారా? కేదార్‌నాథ్ ఆలయంలో 228 కేజీల పసిడి లేదు. దర్యాప్తు కూడా మొదలుపెట్టలేదు. దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. అలా జరగడానికి వీల్లేదు’’ అని అవిముక్తేశ్వరానంద అన్నారు.రాజధాని ఢిల్లీలో కేథార్‌నాథ్ ఆలయం నిర్మాణానికి జులై 10న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పూజారులు నిరసనకు దిగారు. తామంతా సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్లమని, పాపం, పుణ్యాలకు నిర్వచనం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ద్రోహం అతి పెద్ద పాపమని. మోసం చేసే వ్యక్తి హిందువు కాలేడని అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యానించారు.