జింబాబ్వే గడ్డపై టీ20 సిరీస్‌ని ఘన విజయంతో భారత్ జట్టు ముగించింది. ఆదివారం రాత్రి జరిగిన 5వ టీ20లో భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. చివరి టీ20లో భారత్ 42 పరుగులతో ఘన విజయం సాధించగా, సిరీస్‌ను కూడా 4-1తో కైవసం చేసుకుంది. కానీ..టీమిండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. శివం దుబే 2 వికెట్లతో రాణించగా.. అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్ పాండేలు తలో వికెట్ తీశారు. దాంతో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ కాగా, 5 టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుని సత్తా చాటింది యంగ్ ఇండియా.
Share