మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ జట్టు 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సరిగ్గా 20 ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 54 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా జట్టుని గెలిపించలేకపోయింది. ఈ మ్యాచ్ ఓటమితో భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే భారత్ సెమీస్ చేరేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది. గ్రూప్-ఏలో సోమవారం చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ బృందం సెమీస్‌కు అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ఇందుకు నెట్ రన్ రేట్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ జట్టు 53 పరుగులకు మించి తేడాతో లేదా లక్ష్యాన్ని 9.1 ఓవర్లలోపే ఛేదించకూడదు. అలా చేస్తే భారత్, న్యూజిలాండ్ ఇంటికి వెళ్తాయి. పాక్ సెమీస్ చేరుతుంది. కాబట్టి.. ఈరోజు న్యూజిలాండ్‌పై పాక్ గెలవాలి.. కానీ భారీ తేడాతో గెలవకూడదని భారత్ కోరుకోవాలి.
Share