Current Date: 28 Nov, 2024

బాలిక హత్య కేసులో యువకునికి 20 ఏళ్ల జైలు, రూ.50 వేలు జరిమానా

 శారీరకంగా లైంగిక దాడి చేసి ఆమె మృతికి కారణమైన యువకునికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని  ఫోక్సో కోర్టు న్యాయమూర్తి జి ఆనంది బుధవారం సంచలన తీర్పునిచ్చారు. జైలు శిక్షతో పాటు రూ.50 వేల రూపాయల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అదనంగా ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి  తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ.1,50,000 చెల్లించాలని, ప్రభుత్వం తరపున రూ.3 లక్షలు కూడా ఇవ్వాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాల ప్రకారం, మృతురాలు(13) తమ కుటుంబ సభ్యులతో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్లవారిపల్లెలోని ప్రణయ్ అపార్ట్మెంట్లో ఉంటూ. నడిపూరు ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుండేది. ఆమె తండ్రి సత్యం విజయనగరం జిల్లా పాత పాలవలస నివాసి. నేరం జరగడానికి నాలుగేళ్ల ముందు విశాఖలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రణయ అపార్ట్మెంట్లో సత్యం  వాచ్మెన్ గా చేరాడు. ఎదురుగా ఉన్న ఆదిత్య రెసిడెన్సీలో దిగుమర్తి నరేష్(28) అనే యువకుడు కార్పెంటర్ పని చేస్తుండేవాడు . అదే అపార్ట్మెంట్లోని మొదటి అంతస్తులో 101 గది తీసుకుని ఉండేవాడు. ఈ నేపథ్యంలో బాలికకు, నరేష్ కి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. నరేష్ తరచూ బాలికతో లైంగిక దాడికి పాల్పడేవాడు. 2021 అక్టోబరు ఐదో తేదీన అర్ధరాత్రి నరేష్ ఫోన్ చేయడంతో బాలిక అతని రూమ్ కి వెళ్ళింది. అక్కడ బాలికపై నిందితుడు లైంగిక దాడి చేసి, నరేష్ ఆమెని రూములో ఉంచాడు. ఈ లోపు బాలిక తండ్రి కూతురు కనిపించలేదంటూ వెతకడం ప్రారంభించాడు.  విషయాన్ని గమనించిన నరేష్ బాలికను వెనుక భాగం నుంచి ఇంటికి వెళ్లి పోవాలని హెచ్చరించాడు. అయితే తల్లిదండ్రులకు భయపడిన బాలిక ఆదిత్య అపార్ట్మెంట్ మేడ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేసింది.  

Share