Current Date: 27 Nov, 2024

భారతీయుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజులు కలెక్షన్ ఎంతో తెలుసా?

భారతీయుడు-2 చిత్రం జులై 12 న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా ఈ సినిమా మొదటి షో తోనే  నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పుటికీ భారతీయడు వంటి సూపర్ హిట్ సినిమా కు సీక్వెల్ గా వచ్చింది. కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా మొదటి రెండు రోజులు బాగానే కలెక్ట్ చేసింది. కానీ మూడు రోజులు నుండి వర్షాల కారణంగా అనుకున్న స్థాయికి కలెక్ట్ చేయలేకపోయిన ఈ సినిమా కలెక్షన్లు బాగా తగ్గాయి. తెలుగు రాష్ట్రల్లో సినిమా బ్లాక్ ఆఫీస్ దగ్గిర 6వ రోజున 46 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది. దాంతో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు కలెక్టన్స్ ని గమనిస్తే నిజాం (5.65కోట్లు ) సిడెడ్ (1.68కోట్లు ) యూఏ(1.53కోట్లు ) ఈస్ట్ (90లక్షలు ) వెస్ట్ (60లక్షలు ) గుంటూరు (1.11కోట్లు ) కృష్ణ (88లక్షలు ) నెల్లూరు (47లక్షలు ) మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ చుస్తే 12.82కోట్లు (21.55కోట్లు ~గ్రాస్ ) మొత్తం మీద సినిమా 25కోట్టు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 12.18కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన ఉంది.మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 172 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 110.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన  ఉంది. పండగ హాలిడే కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు.

Share