భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రణ్వీర్ సింగ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద నేరుగా తలపడ్డాయి. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ రెండు చిత్రాల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో 2011లో 'పంజా' వర్సెస్ 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్', 2023లో 'బ్రో' వర్సెస్ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' సమయాల్లోనూ ఈ ఇద్దరు హీరోలు పోటీపడగా, ఆ రెండు సందర్భాల్లోనూ రణ్వీర్ సినిమాలే పైచేయి సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ మొదలైంది. ప్రస్తుత టాక్ విషయానికొస్తే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. పెయిడ్ ప్రివ్యూలతోనే రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, మొదటి రోజు భారత్ లో దాదాపు రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించి బాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. రణ్వీర్ సింగ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్సుల్లో కూడా ఈ చిత్రం గట్టి ప్రభావం చూపుతోంది. మరోవైపు, పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ మేనరిజమ్స్ అభిమానులను అలరిస్తున్నప్పటికీ, కథలో కొత్తదనం లేకపోవడం, ఔట్ డేటెడ్ కంటెంట్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Share