జూన్ 2న తాను తిరిగి లొంగిపోనున్నానని ఢల్లీి సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. శుక్రవారం ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి వచ్చిన తాను లొంగిపోనున్నట్టు తెలిపారు. జైలులో తనను ఎన్ని వేధింపులకు గురి చేసినా తలవంచనని తన మద్దతుదారులకు వెల్లడిరచారు.కోర్టు ఆదేశాల మేరకు తాను జూన్ రెండున నేను లొంగిపోవాల్సి ఉంది. ఈసారి ఎంతకాలం జైలులో ఉంటానో తెలియదన్నారు. నియంతృత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడేందుకు నేను జైలుకు వెళ్తున్నానని పేర్కొన్నారు. అందుకు గర్వంగా ఉందన్నారు. దేశం కోసం వందసార్లు అయినా జైలుకు వెళ్లేందుకు సిద్ధం అన్నారు. వారు తనను రాజకీయంగా అణగదొక్కడానికి ఎంతో ప్రయత్నించారు. జైలులో ఉన్నప్పుడు మెడిసిన్ అందకుండా కూడా అడ్డుకున్నారని ఆరోపించారు. తాను అరెస్టు అయినప్పుడు 70 కేజీలు ఉన్నాను. అక్కడున్న సమయంలో ఆరు కేజీలు తగ్గిపోయాను. బయటకు వచ్చిన తర్వాత ముందులాగా బరువు పెరగలేదు. దాంతో కొన్ని పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అంతర్గతంగా ఉన్న ఆరోగ్య పరిస్థితికి ఇది ఒక సంకేతం కావొచ్చని వారు అనుమానిస్తున్నారు అని కేజ్రీవాల్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇంటి నుంచి బయల్దేరి, పోలీసుల ముందు లొంగిపోతానని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఈసారి తనను ఇంకా వేధింపులకు గురిచేసేలా ప్రయత్నాలు జరగొచ్చని సందేహం వ్యక్తం చేశారు. నేను జైలుకెళ్లిన తర్వాత.. మీ (ప్రజలు) గురించే ఎక్కువ ఆలోచిస్తాను. ఈ సమయంలో మీకు ఒక హామీ ఇస్తున్నాను. ఢల్లీి ప్రభుత్వం నుంచి మీకు అందుతున్న సేవల్లో ఎలాంటి మార్పు ఉండదు. త్వరలో ప్రతి తల్లికి, సోదరికి నెలకు రూ.వెయ్యి అందుతుంది. ఒక కుమారుడిలా, సోదరుడిలా నేను మీకోసం పని చేశాను. ఈరోజు మీకొక అభ్యర్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి’’ అని ఉద్వేగంతో అన్నారు.మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. అయితే దానిపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ప్రస్తుతం ఢల్లీి కోర్టులో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి.