Current Date: 02 Jul, 2024

చంద్రబాబు కార్యసాధకుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ కొనియాడారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారు. గతంలో ఉద్యోగాలు లేకుండా యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్‌కు మంచి శాఖలనే కేటాయించారు.  కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉంది. అలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతం

Share